- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రుషికొండ బీచ్‌లో మళ్లీ రెపరెపలాడుతున్న బ్లూ ఫ్లాగ్.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో(Vishakapatnam)ని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్(Blueflag) గుర్తింపును పునరుద్ధరించారు. ఈ మేరకు గుర్తింపు పత్రాన్ని బ్లూ ఫాగ్ సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్‌కు నిన్న(శనివారం) అందించారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) హర్షం వ్యక్తం చేశారు. రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ బీచ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చి బ్లూ ఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
యుద్ధప్రాతిపదికన పర్యాటక శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తూ అనతి కాలంలోనే బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు పాటుపడ్డారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం పర్యాటక శాఖ అధికారుల కృషిని, విశాఖ కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్ చొరవను, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారులను మంత్రి దుర్గేష్ అభినందించారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే భారతదేశం(India)లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన మొదటి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ ఒకటని తెలిపారు. నిరంతరం రుషికొండ బీచ్ లో భద్రతా ప్రణాళిక, పర్యావరణం, ట్రాఫిక్, నీటిశుద్ధి, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు. మంత్రి దుర్గేష్ మరి కొన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే మరింత అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. ఇప్పటికే రుషికొండ బీచ్ పై విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియా అధికారులు ఇప్పటికే రుషికొండ బీచ్ పై విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ మళ్లీ రుషికొండ బీచ్ కు బ్లూఫాగ్ హోదాను ప్రకటించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన రుషికొండ బీచ్ లో మళ్లీ రెపరెపలాడుతోంది.