రిలీజ్‌కు ముందే 14 ఇంటర్‌నేషనల్ అవార్డులు అందుకున్న సినిమా ఓటీటీలోకి వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

by Kavitha |
రిలీజ్‌కు ముందే 14 ఇంటర్‌నేషనల్ అవార్డులు అందుకున్న సినిమా ఓటీటీలోకి వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తనయురాలు సుకృతి వేణి(Sukruthi Veni) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’(Gandhi Thatha Chettu). పద్మావతి మల్లాది(Padmavathi Malladi) తెరకెక్కించిన ఈ సినిమాకు సుకుమార్ భార్య బబిత(Babita) నిర్మాతగా వ్యవహరించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కూడా సహకారం అందించింది. ఈ చిత్రంలో సుకృతి వేణితో పాటు రాగ్‌ మయూర్‌(Rag Mayur), ఆనంద్‌ చక్రపాణి(Anand Chakrapani), రఘురామ్‌(Raghuram), భాను ప్రకాష్‌(Bhanu Prakash), నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 24న థియేటర్లలో విడుదలైన గాంధీ తాత చెట్టు కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక స్టూడెంట్‌గా నటించిన సుకుమార్ కూతురి యాక్టింగ్‌కు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడుదలకు ముందే ఏకంగా 14 ఇంటర్‌నేషనల్ అవార్డులు తెచ్చుకున్న గాంధీ తాత చెట్టు సినిమా ఇప్పుడు ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది.

అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం (మార్చి 21) నుంచి ఈ సినిమా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండి.

Next Story