నా తప్పేమీ లేదు... నన్ను పరీక్షకు అనుమతించండి

by Naveena |
నా తప్పేమీ లేదు... నన్ను పరీక్షకు అనుమతించండి
X

దిశ ,నకిరేకల్ :నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పదవ తరగతి పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటగా అధికారులను సస్పెండ్ చేయగా.. ఆదివారం 11 మంది నిందితులను గుర్తించారు. తాజాగా సోమవారం ఓ విద్యార్థినిని డిబార్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన తప్పేమీ లేదని, తనను పరీక్షకు అనుమతించాలని కోరారు. ఎవరో ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి క్యూస్షన్ పేపర్ ఫోటో తీసుకున్నారని వాపోయింది. ఆ సమయంలో తనకు ఏమి చేయాలో తెలిక వద్దని చెప్పనని పేర్కొంది. అయినవారు బెదిరించడంతో.. చేసేదేమీ లేక పేపర్ చూపించానని వాపోయింది. వారు ఎవరో కూడా తనకు తెలియదని ఆరోపించింది.

అదేవిధంగా పోలీసులు 11 మంది ఆకతాయిలను గుర్తించి అరెస్టులు చేశారు. కానీ ఎటువంటి ప్రమేయం లేని తనను డిబార్ చేయడం న్యాయం కాదని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎవరో చేసిన దానికి తను ఎందుకు బలి కావాలని ప్రశ్నిస్తుంది. తను బాగా చదివనని, భవిష్యత్తు కోసం తనను ఇబ్బందులకు గురి చేయొద్దని వేడుకుంది. పరీక్షకు అనుమతించకపోతే తనకు చావే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీసులు విచారణ పేరిట రాత్రి 10:30 వరకు తనతో పాటుగా తల్లిదండ్రులను స్టేషన్ లో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ పరీక్ష పత్రం లీకేజీలో తనకు సంబంధం లేదని తెలిపింది. అన్ని విధాలుగా విచారణ చేసి పరీక్షకు అనుమతించాలని వేడుకుంది. ఈ ఘటనపై వెంటనే కలెక్టర్, డిఎస్పి స్థాయి అధికారులు పరిశీలించాలని,తన భవిష్యత్తుని పాడు చేయద్దని పేర్కొంది.

Next Story

Most Viewed