మేడిగడ్డ కుంగిన ఘటనలో కీలక పరిణామం.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!

by Shiva |
మేడిగడ్డ కుంగిన ఘటనలో కీలక పరిణామం.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram) ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance and Enforcement) విచారణ ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణలో భాగంగా అధికారులు తాజాగా మేడిగడ్డ (Medigadda)తో పాటు అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీల నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. ఆ నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌తో పాటు మరికొన్ని పియర్స్‌ కూడా దెబ్బతిన్నట్లుగా పేర్కొన్నారు. ఎన్డీఎస్‌ఏ (SDSA) నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్డు మేరకు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో పూర్తిగా విఫలం అయ్యారని పేర్కొన్నారు.

అదేవిధంగా బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములు అయిన 17 మంది సీనియర్‌ ఇంజినీర్లపై క్రిమినల్‌ కేసులు (Criminal Cases) పెట్టాలంటూ సిఫార్సు చేశారు. నిర్మాణ సంస్థ ఎల్‌ ‌అండ్‌‌ టీ (L&T)పై కూడా చర్యలకు తీసుకోవాలని వెల్లడించింది. అందులో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు (Nalla Venkateshwarlu)తో పాటు గతంలో ఎస్‌ఈగా విధులు నిర్వర్తించిన రమణా‌రెడ్డి (Ramana Reddy), ఏఈ తిరుపతిరావు (Tirupati Rao), సీఈ సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మరో 30 మంది ఏఈఈ (AEE), డీఈఈ (DEE)లపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance and Enforcement) ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Next Story