- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రతీ మండలానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి.. బీజేపీ ఎంపీ కీలక పిలుపు

దిశ, వెబ్ డెస్క్: ప్రతీ మండలానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ బీజేపీ కార్యకర్త పని చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (Mahaboob Nagar MP DK Aruna) అన్నారు. గద్వాల పట్టణంలోని (Gadwal Town) జరిగిన జిల్లా బీజేపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆమె.. నూతన అధ్యక్షులు, కమిటీకి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. నూతన అధ్యక్షులు రామాంజనేయులు (Gadwal BJP President T.Ramanjaneyulu) ఆధ్వర్యంలో కార్యకర్తలు అంతా కష్టపడి పనిచేస్తారని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తారాని నమ్ముతున్నానని అన్నారు. అలాగే 70 వేల ముస్లింల ఓట్లు ఉన్న ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యేగా (BJP MLA) గెలిచిన పార్థసారధి (Pardthasaradhi) ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, పార్థసారధి గెలుపును స్ఫూర్తిగా గద్వాల ప్రజలు బీజేపీని (BJP) బలపర్చాలని పిలుపునిచ్చారు.
గత ఎంపీ ఎన్నికల్లో (MP Elections) 20 వేల మెజారిటీ ఇచ్చి ఇప్పటికే గద్వాలలో బీజేపీ విజయం తధ్యం అని కార్యకర్తలు నిరూపించారని, తప్పకుండా గెలుస్తాము అన్న నమ్మకం కార్యకర్తలు పెంచుకోవాలని సూచించారు. తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పటికీ.. ఎల్లప్పుడు ఇక్కడి కార్యకర్తలకు, ప్రజలకు ఫోన్ లో అందుబాటులోనే ఉంటానని, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే చాలు.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు ముందుండి గెలుపు సాధించాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గెలుపే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త (BJP Activists) పని చేయాలని చెప్పారు. జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయలు అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. ఇక ప్రతి మండలానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని సమాచారం అందరికి చేరవేయాలని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తాలని బీజేపీ ఎంపీ (BJP MP) పిలుపునిచ్చారు.