- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అసెంబ్లీలో మా ప్రస్తావన రాగానే బీఆర్ఎస్ నేతలు ఎందుకు నవ్వారు

దిశ, ఖైరతాబాద్ : అసెంబ్లీలో ట్రాన్స్ జెండర్ అనే పదం రాగానే బీఆర్ఎస్ లీడర్లు నవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లు శుక్రవారం ట్యాంక్ బండ్ పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో గురువారం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తమ ప్రభుత్వం 50 మంది ట్రాన్స్ జెండర్ లను పైలట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించినట్లు తెలిపారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ లు హేళనగా నవ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. పదేళ్లలో మీరు మాకు ఏం చేశారు.. ఏ రోజైనా మీ నోట్లో నుంచి ట్రాన్స్ జెండర్ అనే పదం వచ్చిందా అని ప్రశ్నించారు. అందరి లాగే మేము కూడా మనుషులమే కదా , మాకూ మనోభావాలు ఉంటాయి..మమ్మల్ని కూడా అందరి లాగా సమానంగా చూడండి..దయచేసి ఇంకోసారి మమ్మల్ని కించ పరిచే విధంగా ప్రవర్తించకండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.