- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Richest Comedian: ప్రభాస్, రణబీర్, రజనీ హీరోలకంటే దేశంలోనే అత్యంత రిచ్ కమెడియన్ ఎవరో తెలిస్తే ఖంగుతినాల్సిందే..?

దిశ, వెబ్‌డెస్క్: మూవీలో కమెడియన్ లేకపోతే ఎంతమంచి సినిమా అయినా బోరింగ్‌గా ఫీల్ అవుతుంటారు. కాగా ఏ చిత్రంలోనైనా తప్పక ఓ హాస్యనటుడు ఉండాల్సిందే.. ఉంటాడు కూడా. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే.. అలరించేవారిని కమెడియన్‌గా చెప్పుకుంటాం. మరీ దేశంలోనే రిచ్ కమెడియన్ ఎవరో ఇంతవరకు ఎవరికీ సరిగ్గా తెలియదు. కొంతమందికి అత్యంత ధనిక కమెడియన్ అనగానే కపిల్ శర్మ నేమ్ గుర్తొస్తుంటుంది.
కపిల్ శర్మ (Kapil Sharma) తన ప్రదర్శనలతో, రంగస్థల నటన, చలనచిత్ర ప్రదర్శనలతో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ వాస్తవానికి మన ఇండియాలో రిచ్ కమెడియన్ వేరే ఒకరు ఉన్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరీ ఆ కమెడియన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) భారతదేశంలోనే రిచ్ కమెడియన్ అని నివేదికలు చెబుతున్నాయి.
ఏకంగా ఈయన వెయ్యికి పైన సినిమాల్లో నటించి.. రికార్డు క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్యానందం ఏకంగా కెరీర్‌లోనే 60 మిలియన్ డాలర్ల సంపదను కూడబెట్టారని సమాచారం. అంటే నికర విలువ ఐదు వందల కోట్లకు పైనే అని అర్థం. అయితే కేవలం కమెడియన్లలోనే కాకుండా..
హీరోలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (రూ. 300కోట్లు), రణబీర్ కపూర్(రూ 350కోట్లు), రజనీకాంత్ ( రూ. 400 కోట్లు) కంటే ఎక్కువ రిచ్ అని నెట్టింట నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక కపిల్ శర్మ నికర విలువ రూ. 300 కోట్లు అని నివేదించబడింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దటీజ్ బ్రహ్మానందం అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.
READ MORE ...
ప్రభాస్‌కు అన్నగా నటించబోతున్న స్టార్ నటుడు.. సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరిందిగా అంటున్న నెటిజన్లు