పలు జిల్లాలో వడగాల్పులు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

by Vinod kumar |
పలు జిల్లాలో వడగాల్పులు.. హెచ్చరించిన వాతావరణ శాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాతావరంల్లో కలుగుతున్న మార్పుల కారణంగా నేడు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో నేడు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది . నేడు పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 11 నుంచి 13వ తేదీ వరకు వర్షాలు కురిసే సూచనలున్నాయి. జిల్లాలో పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైంది. శుక్రవారం పలు జిల్లాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు .ఇక హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40, కనిష్ట ఉష్ణోగ్రత 27, మెదక్ గరిష్ట ఉష్ణోగ్రత 41.4, కనిష్ట ఉష్ణోగ్రత 26, నల్గొండ గరిష్ట ఉష్ణోగ్రత 42.5, కనిష్టంగా 25.2, రామగుండం గరిష్టంగా 42.6, కనిష్టంగా 28.4, ఆదిలాబాద్ గరిష్టంగా 42.8, కనిష్టంగా 30.5, భద్రాచలంలో 42.2 కనిష్ట ఉష్ణోగ్రతలు 43.2గా నమోదయ్యాయి. , 28.5 హనుమకొండ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

Next Story