Thummala Nageswara Rao : రాష్ట్రంలో ఈ దినం చారిత్రాత్మకం: మంత్రి తుమ్మల ఎమోషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-07-18 11:51:33.0  )
Thummala Nageswara Rao : రాష్ట్రంలో ఈ దినం చారిత్రాత్మకం: మంత్రి తుమ్మల ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతులకు రుణ మాఫీ చేసిన ఈ దినం చారిత్రాత్మకం అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులంతా ఇవాళ పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. రుణమాఫీకి నిధుల సమీకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదరైనా తాము వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రతిపక్షాలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని అపహాస్యం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇచ్చి హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి సర్కార్ మాట నిలబెట్టుకుందని గుర్తు చేశారు. అత్యంత కష్టతరమైన బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ చేసి చూపించిందంటూ ఎమోషనల్ అయ్యారు. రైతు రుణమాఫీ విషయంలో తమ అధినాయకుడు రాహుల్‌గాంధీ మాట ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక భవిష్యత్తులో కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేసి తీరుతామని మంత్రి తుమ్మల అన్నారు.

Advertisement

Next Story