గురుకులాల్లోనే కాదు.. స్కూళ్లలోనూ మూడు జతల యూనిఫాం?

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-19 00:15:42.0  )
గురుకులాల్లోనే కాదు.. స్కూళ్లలోనూ మూడు జతల యూనిఫాం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ ఏటా రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాంల‌ను అందజేస్తోంది. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల ఏకరూప దుస్తులను అందించాలనే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు గురుకులాల్లోని విద్యార్థులకు మాత్రమే మూడు జతలు యూనిఫాంలు ఇస్తుండగా వచ్చే ఏడాది నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా మూడు జతలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రస్తుతం రెండు జతల యూనిఫాంలు మాత్రమే అందిస్తున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్‌ పాఠశాల్లోని 22 లక్షల విద్యార్థులకు యూనిఫాంల‌ను సర్కార్​ పంపిణీ చేస్తోంది. ఒక్కో యూనిఫాంకు రూ.200 చొప్పున రూ.100 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. ప్రతిసారి లాగానే ఈ ఏడాది కూడా టెస్కో ద్వారానే వ‌స్త్రాన్ని సేకరించి విద్యార్థులకు యూనిఫాంలు అందించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా మూడు జతలు అందించే అంశంపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story