- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి ముగ్గురు మంత్రులు కన్ఫామ్
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలుపై మరోమారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి పయనం అవుతున్నారు. ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మరో ఇద్దరు మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పయనమవుతున్నారు. ఎన్ఎస్పీ ధరకు ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కానున్నారు. యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని మెమోరాండం సమర్పించనున్నారు. కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోసం అధికారులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పంజాబ్, గుజరాత్ మాదిరిగా యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఎంఎస్పీ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రా రైస్, బాయిల్డ్ రైస్ చేసుకుంటారా అనేది కేంద్రం ఇష్టమని, ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తామని మంత్రులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నందున ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత స్పందించే దానిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించనుంది. ఢిల్లీకి సైతం అవసరమైతే వెళ్తానని, కిసాన్ సాంగ్ నేతలతో కలిసి ధర్నా సైతం చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.