Hyderabad:నేటి నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..కారణం ఇదే!

by Jakkula Mamatha |
Hyderabad:నేటి నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్:నగరంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన గణపతి ఉత్సవాలు(Ganapati Festivals) ఘనంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో అత్యంత భారీ వినాయకుడు ఖైరతాబాద్(Khairatabad) గణేశ్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. ఈ రోజుతో గణపతి నవరాత్రుల్లో మూడు రోజులు పూర్తయ్యాయి. మరోవైపు ఇప్పటికే చిన్న గణేష్‌లు నిమజ్జనానికి(immersions) సిద్ధమవుతున్నాయి. చవితి ప్రారంభమైన రెండో రోజు నుంచే నగరంలోని పలు చెరువుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో నేటి నుంచి జోరుగా నిమజ్జనాలు(immersions) కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్(Tank bund) పరిసరాల్లో నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని నగర పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.సెయిలింగ్ క్లబ్ టీ జంక్షన్(Sailing Club Tee Junction) నుంచి కర్బలామైదాన్ వచ్చే సాధారణ ట్రాఫిక్‌(Traffic)ను అప్పర్ ట్యాంక్ బండ్(Tank bund) వైపు అనుమతించడం లేదని తెలిపారు. వారంతా కవాడిగూడ వైపు టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Next Story