MLA Lasya Nandita : లాస్య నందిత మృతికి కారణాలివే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-23 05:50:03.0  )
MLA Lasya Nandita  : లాస్య నందిత మృతికి కారణాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఓఆర్ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా అతివేగం, నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఓ కంపెనీకి చెందిన సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న కారును వినియోగించడం, మిడిల్ సీటులో కూర్చున్న నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడం కూడా ఆ మె మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు డ్రైవర్ కాకుండా లాస్య నందిత పీఏ ఆకాష్ కారు నడిపినట్లు తెలుస్తోంది. సేఫ్టీ ఉన్న కారును వాడినా.. ఎక్స్‌పర్ట్ డ్రైవర్ అందుబాటులో ఉన్నా ఈ విషాదం తప్పేదని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story