- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఢిల్లీలోని CM కేసీఆర్ అధికారిక నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఆమె మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో విచారణకు హాజరుకానున్న కవిత.. ఈడీ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం.
దీంతో అప్రమత్తమైన పోలీసులు కవిత నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. విచారణకు వెళ్లే ముందు ఎలాంటి ర్యాలీకి పర్మిషన్ లేదని.. కవితతో పాటు మరో కారుకు మాత్రం అనుమతి ఉందని పోలీసులు మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారు. అయినప్పటికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీకి ప్లాన్ వేస్తుండటంతో వారిని అదుపు చేసేందుకు బలగాలను పెద్ద ఎత్తున మెహరించారు.