మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ.. పహాడీషరీఫ్ పీఎస్‌కు మంచు మనోజ్?

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-15 12:51:52.0  )
మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ.. పహాడీషరీఫ్ పీఎస్‌కు మంచు మనోజ్?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu) ఇంట్లో మళ్లీ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో విష్ణు పంచదార పోసినట్లు సమాచారం. దీంతో మంచు మనోజ్‌ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆదివారం సాయంత్రం మంచు మనోజ్( Manchu Manoj) మరోసారి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌(Pahadi Shareef Police Station)కు వచ్చారు. కంప్లైంట్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే అంతకుముందు ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్‌ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసన్నారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు(Manchu Vishnu) కూడా మోహన్ బాబుతో ఉన్నారు.

Next Story

Most Viewed