నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి : మంత్రి సీతక్క

by Kalyani |
నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి : మంత్రి సీతక్క
X

దిశ, పరిగి : రైతులు పండించిన వరి ధాన్యం నుంచి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పరిగిలోని డీసీఎంఎస్​ రైస్​ మిల్లును ఆదివారం ప్రారంభించారు. డీసీఎంఎస్​ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని డీసీఎంఎస్​ నిర్వాహకులు కుర్వ నరేష్​, మార్కెటింగ్​ శాఖ, డీసీఎం ఎస్​ అధికారులకు సూచించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్​ రెడ్డి, నూతనంగా ఎన్నికైన మార్కెట్​ కమిటీ చైర్మన్​ బూన్నగారి పరశురాంరెడ్డి, వైస్​ చైర్మన్​ సయ్యద్ అయూబ్​ తో, నాయకులు కె.హన్మంతు ముదిరాజ్​, కావలి సత్యనారాయణ, కాంగ్రెస్​ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మూల సత్యనారాయణ రెడ్డి, ఎజాస్​, జగన్​, సర్వర్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed