- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGPSC: గ్రూప్-2 పరీక్షకు సగం మంది అభ్యర్థులే హాజరు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆదివారం పరీక్ష మొదలైంది. కాగా ఈ పరీక్షకు సగం మంటి కూడా అటెండ్ అవ్వలేదు. మొత్తం 5,51,855 మంది గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకుంటే 74.96 శాతం మంత్రి మాత్రమే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నారు. అందులో మొదటి రోజు పేపర్-1కు 2,57,981(46.75%) మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పేపర్-2కు 2,55,490(46.30%) మంది హాజరయ్యారు. ఓవరాల్గా పరీక్ష రాసేందుకు సగం మంది కూడా ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పేపర్ 1 రాసిన వారిలో 2491 మంది పేపర్ 2 రాయకుండానే ఇంటిదారి పట్టారు. ఇదిలా ఉండగా తొలిరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి డెంటల్ కాలేజీలో ఓ అభ్యర్థి మొబైల్ ఫోన్ ను తీసుకురావడం కలకలం రేపింది. సదరు అభ్యర్థి తీరు అనుమానం కలిగించడంతో చీఫ్ సూపరింటెండెంట్ కు అనుమానం వచ్చి తనిఖీ చేయగా లోదుస్తుల్లో ఫోన్ బయటపడినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ స్పష్టంచేశారు. దీంతో సదరు అభ్యర్థిని పరీక్ష రాయనివ్వకుండా అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కాగా ఆ అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు. సదరు అభ్యర్థిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా తొలిరోజు గ్రూప్ 2 పరీక్ష రెండు పేపర్లకు జరిగింది. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కాగా.., పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి ఎగ్జామ్ నిర్వహించారు. సోమవారం మరో రెండు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఈ రెండు పేపర్లలో జనరల్ స్టడీస్ పేపర్ కాస్త కఠినంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. పేపర్-1తో పోలిస్తే పేపర్-2 కాస్త సులభంగా ఉందన్నారు. కాగా పేపర్-1లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం విధానాలపై, సినీ రంగం, అంతర్జాతీయ అంశాలు, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. ఇంగ్లిష్ లో లోతైన భాషా పరిజ్ఞానం ఉంటే తప్పా చేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. పేపర్ 2లో నిజాం నవాబుల కాలం, జోగిని వ్యవస్థ, సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం, జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కమిషన్లు, మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన అంశంతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ అధికారాలపై ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ జిల్లాలపై, మున్సిపాలిటీ, గ్రామ అధికారాలపై ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు తెలిపారు. కాగా పేపర్-2లో హిస్టరీ నుంచి టఫ్ క్వశ్చన్స్ వచ్చాయని, పాలిటీ నుంచి మాడరేట్ గా, సోషియాలాజీ నుంచి సులభమైన ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు.