BB-8 Winner: బిగ్ బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-15 17:35:21.0  )
BB-8 Winner: బిగ్ బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్-8(Bigg Boss season-8) విజేతగా నిఖిల్(Nikhil) నిలిచారు. 105 రోజుల పాటు సాగిన ఆటలో నిఖిల్ తనదైన శైలిలో ఆడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా బిగ్ బాస్ టైటిల్ సాధించాడు. టైటిల్‌తో పాటు రూ.55 లక్షల ప్రైజ్ మనీ, లగ్జరీ కార్‌ను గెలుచుకున్నాడు. రన్నర్‌గా గౌతమ్ నిలిచారు. ఇతనికి రూ.25 లక్షలు ప్రైజ్ మనీ లభించనుంది. ఇదిలా ఉండగా.. కర్ణాటకకు చెందిన నిఖిల్.. గోరింటాకు సీరియల్(Gorintaku Serial) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

గోరింటాకు, కలిసివుంటే కలదు సుఖం, స్రవంతి, ఊర్వశివో రాక్షసివో వంటి సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో టాప్-5గా అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ నిలిచారు. చివరి పోటీ మాత్రం నిఖిల్-గౌతమ్ మధ్యే నడిచింది. ఫైనల్‌గా నిఖిల్‌ విజేతగా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు నిఖిల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.







Advertisement

Next Story

Most Viewed