NZ vs ENG : 143 రన్స్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్

by Harish |
NZ vs ENG : 143 రన్స్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్ మూడో టెస్టులో నెగ్గి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఆ దిశగానే బ్యాటుతో, బంతితో సత్తాచాటిన కివీస్ రెండో రోజు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 136/3 స్కోరుతో నిలిచి 340 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 315/9తో ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి సెషన్‌లోనే తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో తేలిపోయింది. 35.4 ఓవర్లే ఆడి 143 పరుగులకే కుప్పకూలింది. రూట్(32) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4 వికెట్లు, విలియమ్ ఓరౌర్కె, సాంట్నర్ చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 204 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో విల్ యంగ్(60), కేన్ విలియమ్సన్(50 నాటౌట్) సత్తాచాటడంతో కివీస్ భారీ ఆధిక్యం దిశగా వెళ్తున్నది.


Advertisement

Next Story

Most Viewed