Cyclone Chido: ఫ్రాన్స్‌లో చిడో తుపాన్ బీభత్సం..14 మంది మృతి

by vinod kumar |
Cyclone Chido: ఫ్రాన్స్‌లో చిడో తుపాన్ బీభత్సం..14 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్‌ (France)లో చిడో(chido) తుపాన్ బీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని తుపాను తాకడంతో మయోట్ ద్వీపం ( Mayotte)లో 14 మంది మరణించగా 246 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తుపాన్ ప్రభావంతో గంటకు 220 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. గాలుల వల్ల భారీగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కుప్పకూలాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు 3,20,000 మంది నివాసితులను ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. 90 ఏళ్లలో మయోట్‌ను తాకిన అత్యంత భయంకరమైన తుపాన్ ఇదేనని అధికారులు అంచనా వేస్తున్నారు. మయోట్‌లో విధ్వంసం సృష్టించిన చీడో ఆఫ్రికన్ ప్రధాన భూభాగమైన మొజాంబిక్‌కు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీని కారణంగా 2.5 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యే చాన్స్ ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed