- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Addanki: కేటీఆర్.. మంత్రిగా ఒక్క రోజైనా గురుకులాలకు వెళ్లావా?.. అద్దంకి దయాకర్
దిశ; తెలంగాణ బ్యూరో : ‘మిస్టర్ కేటీఆర్..మంత్రిగా ఉన్నంత కాలం ఒక్క రోజైన గురుకులాలకు వెళ్లినావా’ ? అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ లో ఉన్నంత కాలం ఆడియో పంక్షన్లు, సినీ పార్టీలకు పెద్దపీఠ వేశారన్నారు. పేద విద్యార్ధుల గొస పట్టించుకోలేదన్నారు. పదేళ్లుగా గురుకులాల్లో కాస్మొటిక్స్ డైట్ చార్జీలు పెంచలేదన్నారు. కానీ తన సీఎం రేవంత్ రెడ్డి గొప్ప ఆలోచనతో గురుకులాల్లో విద్యార్ధులకు మరింత విశ్వాసం పెంచాడన్నారు. విద్యార్థి ఉద్యమాలు, హాస్టల్స్ సమస్యలు, దుర్భర జీవితాలను కళ్లారా చూసిన రేవంత్...ఇప్పుడు కీలక మైన నిర్ణయాలు తీసుకుంటూ పేద ప్రజల ఆనందానికి కారణమవుతున్నాడన్నారు. గురుకులాల్లో కాస్మోటిక్, డైట్ చార్జీల పెంపు తో విద్యార్ధుల దశ దిశ మారిందన్నారు. 1023 గురుకాలలో 6 లక్షల విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో గురుకులాల్లో అవినీతి, అక్రమాలు జరగాయన్నారు. సీఎం గా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గురుకులాల డెవలప్ కు రూ. 21 వేల కోట్లు మంజూరు చేశారన్నారు. రేవతి చనిపోతే స్పందించని కేటీఆర్..సినిమా హీరోకు మద్ధతుగా నిలవడం విచిత్రంగా ఉన్నదని ఫైర్ అయ్యారు.