- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. 39 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో కొత్తగా కొలువు దీరిన మహాయుతి కూటమి కేబినెట్ విస్తరణను ఆదివారం చేపట్టింది. బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలకు చెందిన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇందులో బీజేపీకి19, శిండే సేనకు 11, ఎన్సీపీకి 9 చొప్పున మంత్రి పదవులు దక్కాయి. అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్న దృష్ట్యా మొత్తం 43 మంది మంత్రులు ఉండాల్సి ఉంది. తాజా కేబినెట్ విస్తరణతో సీఎం, డిప్యూటీ సీఎంలను కలిపి ఈ సంఖ్య మొత్తం 42కి చేరింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన పది రోజులు మహాయుతి సర్కార్ కేబినెట్ విస్తరణ చేపట్టింది. అదే రోజు డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ నుంచి వీరే..
బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ బవంకులే, రాధాక్రిష్ణ వికె పాటిల్, చంద్రకాంత్ పాటిల్, అశిష్ షెలర్, పంకజ ముండే, గణేష్ నాయక్, జయకుమార్ రావల్, శివేంద్రజే భోంస్లే, అతుల్ సవే, అశోక్ రమాజీ ఉయికే, సంజయ్ సవ్‌కరే, నితిష్ రాణే, గిరిష్ మహాజన్, మాధురి మిసల్, మేఘన బోర్డికర్‌లు బీజేపీ తరఫున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏక్ నాథ్ షిండే క్యాంప్ నుంచి..
ఉదయ్ సమంత్, గుల్‌బ్రావ్ పాటిల్, దాదాజీ భుసే, సంజయ్ రాథోడ్, సంజయ్ శిర్సత్, శంభురాజ్ దేశాయ్, ప్రతాప్ సార్నాయక్, ప్రకాష్ అబిట్కర్, అశిష్ జైస్వాల్, భరత్‌షెట్ గోగవాలె, యోగేష్ కడమ్‌లు శివసేన(ఏక్ నాథ్ షిండే) పార్టీ నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అజిత్ పవార్ ఎన్సీపీ..
హసన్ ముష్రిఫ్, ధనుంజయ్ ముండే, దత్రాయ్ భర్నే, అదితి టట్కరే, మాణిక్ రావు కోకటే, మకరంద్ పాటిల్, నరహరి జిర్వాల్‌లు అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ నుంచి మినిస్టర్స్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.