child rearing: పాత తరాన్నే ఫాలో అవుదాం.. పిల్లల్ని ప్రగతి బాటలో నటిపిద్దాం

by sudharani |
child rearing: పాత తరాన్నే ఫాలో అవుదాం.. పిల్లల్ని ప్రగతి బాటలో నటిపిద్దాం
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్ల (mobile phones)కు ఎడిక్ట్ (Edict) అవుతున్నారు. తిండి తినాలన్నా, నిద్ర పోవాలన్న మొబైల్స్ కావాలంటూ మారం చేస్తూ గంటల తరబడి ఫోన్లలోనే బతికేస్తున్నారు. ఇక పెద్దలు కూడా ఫోన్ (phone) ఇచ్చేస్తే ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్లు కూడా పిల్లల బాటనే నటుడుస్తున్నారు. దీని వల్ల పిల్లలు మానసికంగా, ఆరోగ్యపరంగానూ పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ముఖ్యంగా కంటిచూపు (eye gaze) కోల్పోతున్నారు. అందుకే, పిల్లల స్క్రీన్‌టైమ్‌ (screen time) తగ్గించాలనీ, వారిని ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలనీ సూచిస్తున్నారు నిపుణులు.

అలా చేయాలి అంటే మన పాత తరాన్ని ఫాలో అవ్వాలి అంటున్నారు. నైంటీస్‌ కిడ్స్‌ (Nineties Kids) ఎక్కువగా పుస్తకాలే నేస్తాలుగా గడిపే వారు. అలాగే చందమామ కథలు చదువుతూ.. నిద్రలోకి జారుకున్న తరం వాళ్లది. ఇప్పుడు తరానికి ఇది అలవాటు చేస్తూ.. మీ పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచండి. ప్రతిరోజూ పడుకునే ముందు.. వారికి ఒక మంచి పుస్తకం (book) ఇచ్చి చదవమనండి. పుస్తకాలు చదవడం వల్ల వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. భాషా నైపుణ్యాలూ మెరుగుపడుతాయి. అలాగే ఆరు బయట ఆటలు ఆడటం వల్ల ఫిజికల్‌ (physical)గా కూడా స్ట్రాంగ్‌ (Strong)గా అవుతారు. అందుకే నైంటీస్‌ కిడ్స్‌‌తో పోల్చితే ఇప్పుడు పిల్లలు మానసికంగా, శారీరకంగాను, బుద్ధి పరంగాను చాలా వీక్‌గా ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed