దేవాలయాల అభివృద్ధికి కృషి

by Naveena |
దేవాలయాల అభివృద్ధికి కృషి
X

దిశ, మక్తల్: దేవాలయలను అభివృద్ధి చేయడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వృధాగా ఉన్న భూముల్లో సోలార్ ప్రాజెక్టులు,ఆయిల్ ఫామ్ సాగు,మాన్యులను లీజు నుండి వచ్చే ఆదాయాలతో దేవాలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.ఆదివారం మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల్లో పాల్గొన్నమంత్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు మక్తల్ పట్టణంలో అతి పురాతనమైన నల్లజనం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మక్తల్ ప్రాంతంలో అతి పురాతనమైన మందిరాలు, మఠాలు నిలయమై ఉందని, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరడంతో..స్పందించిన మంత్రి తనమంత కృషి చేస్తానన్నారు. అలాగే గత ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి నిర్మాణం చేసిన యాదాద్రిలో భక్తులకు సరియైన సౌకర్యాలు కల్పించలేదని, తమ ప్రభుత్వ హయాంలో భక్తులకు సౌకర్యాలతో కూడిన వసతులు కల్పిస్తున్నామని ఆమె అన్నారు. దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని, అలాంటివి ఏమన్నా ఉంటే తమ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువస్తే వాటిపై కమీషనర్లతో చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి .లక్ష్మారెడ్డి. బాలకృష్ణారెడ్డి. చంద్రకాంత్ గౌడ్, దేవాదాయ జిల్లా కమిషనర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed