Chicken biryani: బంపర్ ఆఫర్.. రూ. 4 లకే బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం

by Ramesh Goud |
Chicken biryani: బంపర్ ఆఫర్.. రూ. 4 లకే బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం
X

దిశ, వెబ్ డెస్క్: కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేయడంతో తక్కువ ధరకే బిర్యానీ(Biryani) అని బంపర్ ఆఫర్(Bumper Offer) ప్రకటించారు. దీంతో జనం భారీగా క్యూ కట్టారు. అనకాపల్లి జిల్లా(Anakapalli District) నర్సీపట్నంలో(Narsipatnam) అన్‌లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్(Unlimited Milti Cusine Restarent) పేరుతో ఇవాళ ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా రెస్టారెంట్ యజమాని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రెస్టారెంట్ ప్రమోషన్‌లో భాగంగా రూ. 4 లకే చికెన్ బిర్యానీ అని నిర్వాహకులు ప్రకటన ఇచ్చారు. అది కూడా డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 వరకే ఉంటుందని ప్రచారం చేయించారు. దీంతో వందలు పెట్టి కొనాల్సిన బిర్యాని కాస్త తక్కువ ధరకే దొరుకుతుండటంతో స్థానికులు పెద్దఎత్తున ఎగబడ్డారు. బిర్యానీ కోసం రెస్టారెంట్ ఎదుట పెద్ద లైన్ ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. బిర్యానీ ప్రకటన పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలను అదుపు చేశారు.

Advertisement

Next Story

Most Viewed