- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే
దిశ,వనపర్తి : కేజీబీవి,గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి,ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లా డీసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని వనపర్తి కస్తూర్బా గాంధీ, గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ..కస్తూర్బా గాంధీ పాఠశాలలో మీ ఇంటికన్నా 3 రేట్లు మంచిగా ఉంటోందన్నారు. తాను చదువుకునే కాలంలో సరిగా వసతులు లేవని..ఇప్పుడు చాలా బాగున్నాయన్నారు. విద్యార్థులు చదువుకొని ఉన్నంత స్థాయికి చేరాలన్నారు. కష్టపడి చదువుకొని ప్రభుత్వానికి ర్యాంకులను బహుమతిగా ఇవ్వాలన్నారు. పార్లమెంటుకు సంబంధించిన నిధులు 5 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ స్కూల్ కి ఖర్చు చేయాలని కలెక్టర్లకు చెప్పానన్నారు.
150 కోట్లతో ఇంటర్నేషనల్ సమీకృత భవనం
వనపర్తి నియోజకవర్గంలో సమీకృత భవనం మంజూరు చేశామని ఎంపీ తెలిపారు. దాదాపుగా 2500 మంది స్టూడెంట్స్ చదువుకోడానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. దీనిని ఇంటర్నేషనల్ లెవల్ మాదిరిగా తయారు చేస్తామన్నారు. రూ.150 కోట్ల తో అంతర్జాతీయ ప్రమాణలతో నిర్మాణం చేపడుతున్నామన్నారు. గత పాలకులు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్లారని, దానికి 6 కోట్ల వడ్డీ కడుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికగా ఇబ్బందిలో ఉందన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ,గురుకుల పాఠశాలలో గత పాలకులు సమస్యలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని వనపర్తికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పూటపాకాల మహేష్, మాజీ పీసీసీ డెలిగేట్ సభ్యులు శంకర్ ప్రసాద్, ఎంపీపీ కిచ్చా రెడ్డి , ఎంపీపీ శంకర్ నాయక్, కౌన్సిలర్లు, సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మైనారిటీ నాయకులు రహీం, స్కూల్ ప్రిన్సిపాల్, కేజీవీబీ అధికారి శుభలక్ష్మి, స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు