- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS: 'కారు'లో కుంపటి!.. టికెట్ల కోసం టీఆర్ఎస్ నేతల మధ్య ఫైట్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్లో వర్గపోరు, విభేదాలు ఆ పార్టీ అధిష్టానికి తలనొప్పిగా మారుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్న పార్టీ పెద్దలకు ఈ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. సొంత పార్టీ నేతలో ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. సవాళ్లతో ఆగకుండా వ్యతిరేకంగా కరపత్రాలు సైతం పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తుంటే.. ఆ పార్టీ లీడర్లు మాత్రం ఎదో ఒక విషయంలో రచ్చకెక్కుతున్నారు. దాదాపు 40పైగా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పంచాయితీ తారస్థాయికి చేరింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆశావహులు.. సిట్టింగులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే అనుచరులను సన్నద్ధం చేస్తున్నారు.
బీరం వర్సెస్ జూపల్లి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు సైతం విసురుకున్నారు. తాజాగా హర్షవర్దన్‌కు వ్యతిరేకంగా జూపల్లి అనుచరులు కరపత్రాలు పంపిణీ చేశారు. బీరం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నారు.
స్టేషన్ ఘనపూర్‌లోనూ..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పంచాయితీ తీవ్రస్థాయికి చేరింది. ఎప్పటికప్పుడు మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. దళితబంధు విషయంలో ఎమ్మెల్యే సక్రమంగా వ్యవహరించడం లేదని, వారి అనుచరులకు బంధువులకు మాత్రమే ఇస్తున్నారని కడియం ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజయ్య.. చిల్లర మాటలు మాట్లాడొద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని కడియం శ్రీహరిని హెచ్చరించారు.
ఉప్పల్‌లోనూ అంతే..
ఉప్పల్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ రామ్మోహన్ వచ్చే ఎన్నికల కోసం ఉప్పల్ నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. టికెట్ పొందేందుకు సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారం క్రితం చర్లపల్లిలో ఓ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బొంతు రాంమ్మోహన్ సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో మీడియా ఎదుట బొంతు శ్రీదేవి కంటతడిపెట్టారు. తన డివిజన్లో తనకు తెలియకుండానే ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంపేస్తానని బెదిరిస్తున్నారని, తన సత్తా ఏంటో చూపిస్తానని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి మాటల్లో వాస్తవం లేదని వెల్లడించారు. ఆమెపై పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీలో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇలా వర్గపోరు కొనసాగుతున్నది. దీనిపై అధిష్టానం పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన పార్టీలో మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కొంతమంది అసంతృప్తి నేతలు, ప్రజల్లో బలమైన కేడర్ ఉన్న నేతలు పార్టీ మారే చాన్స్ ఉందని గ్రహించిన మంత్రి కేటీఆర్ వారితో సంప్రదింపులు జరిపారు. పార్టీ మారొద్దని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఎవరికి వారుగా తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరి వీరిలో టీఆర్ఎస్ తరపున ఎంత మంది బరిలో దిగుతారు, ఎవరు పార్టీ మారుతారనేది సస్పెన్స్‌గా మారింది.
Also Read....