- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TGSRTC : భక్తులకు ఆర్టీసీ శుభవార్త.. కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుండంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: భక్తులకు టీవీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8వ తేదిన ఉండగా.. 7 నుంచి 9వ తేది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోంది.
ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా జాతరకు వెళ్తాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్రదించగలరు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది. ఈ విషయాలను ఎక్స్ వేదికగా శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.