ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉన్నట్టుండి నగరంలో భారీ వర్షం

by Mahesh |
ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉన్నట్టుండి నగరంలో భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఐన నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మారిన ఈ వాతావరణం కారణంగా హైదరాబాద్(Hyderabad ) మహా నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం(Heavy rain ) కురిసింది. ముఖ్యంగా ఖాజాగూడ, గచ్చబౌలి, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, జంబారాహిల్స్, బోరబండ ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అలగే ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట(Ameerpet) ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. హటాత్తుగా మారిన వాతావరణం కారణంగా భారీ వర్షం పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) కామారెడ్డి, జనగామ, మల్కాజ్ గిరి, మెదక్, సంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, భువనగిరి రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed