OnePlus 13: మార్కెట్లో వన్‌ప్లస్ 13 ఫ్లాగ్​షిప్ 5జీ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే..!

by Maddikunta Saikiran |
OnePlus 13: మార్కెట్లో వన్‌ప్లస్ 13 ఫ్లాగ్​షిప్ 5జీ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
X

దిశ, వెబ్ డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్(OnePlus) నుంచి కొత్త మొబైల్ విడుదలైంది. ఈ కొత్త ఫ్లాగ్​షిప్ 5జీ ఫోన్(Flagship 5G phone)ను చైనా మార్కెట్లో నిన్న లాంచ్ చేశారు. 'వన్‌ప్లస్ 13(OnePlus 13)' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. ఈ ఫోన్ విక్రయాలు ఈ రోజు(నవంబర్ 1) నుంచి చైనాలో ప్రారంభం కానుండగా త్వరలో భారత మార్కెట్(Indian Market)లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 12జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.53,100గా కంపెనీ అధికారంగా నిర్ణయించింది. 12జీబీ ర్యామ్+512 జీబీ వేరియంట్ ధర రూ.57,900, 16 జీబీ ర్యామ్+ 512 జీబీ వేరియంట్ ధర రూ.70,900 ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక బ్లూ(Blue), ఒబ్సిడియన్(Obsidian), వైట్(White) కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

వన్‌ప్లస్ 13(OnePlus 13) ఫోన్ ఫీచర్ల వివరాలు..

  • 6.82 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్
  • క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్(Qualcomm Snapdragon 8 Elite Chip)ను అమర్చారు.
  • 12GB RAM+256GB ROM, 12GB RAM+512GB రొం, 16GB RAM+512GB ROM
  • 120Hz రిఫ్రెష్ రేట్(120Hz Refresh Rate)
  • ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్ ఓఎస్ 15తో పని చేస్తుంది.
  • ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాలతో తీసుకొచ్చారు.
  • సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
  • 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది.
Advertisement

Next Story