- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తక్కువ ధరలకు ప్లాట్లు అంటూ రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ మోసం..
దిశ, తెలంగాణ బ్యూరో : ఒకే ల్యాండ్‌లో రెండు అనధికార లే అవుట్లు వేసి వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామంటూ అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ ఎకనామిక్స్ అఫైర్స్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిసూర్య డెవలపర్స్ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేందర్ సురానాలు ఇద్దరు కలిసి వట్టి నాగులపల్లిలోని ఒకటే ల్యాండ్‌లో సాయి తులసి ఎన్క్లేవ్ 4, షణ్ముఖ నివాస్ పేర్లతో అనధికార లేఔట్లు వేశారు. అందులో తక్కువ ధరలకు ప్లాట్లను విక్రయిస్తామంటూ బాధితుల వద్ద నుండి కోట్లలో డబ్బులు వసూళ్లు చేశారు. ఒకే లేఔట్‌లో రెండు వెంచర్లు వేసి అమాయకులను మోసం చేస్తున్నట్లు గుర్తించిన పోతుగంటి గోపాల్ రెడ్డి అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు శుక్రవారం సాయిసూర్య డెవలపర్స్ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేందర్ సురానాలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో సాయిసూర్య డెవలపర్స్ ఎండీ కంచర్ల సతీష్ చంద్ర గుప్తాపై ఆర్థిక నేరాలకు సంబంధించి 11 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.