Muhurat Trading: మూరత్ ట్రేడింగ్.. లాభాలతో ముగిసిన సూచీలు

by Maddikunta Saikiran |
Muhurat Trading: మూరత్ ట్రేడింగ్.. లాభాలతో ముగిసిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండగ(Diwali festival) సందర్భంగా ఈ రోజు నిర్వహించిన మూరత్ ట్రేడింగ్(Muhurat Trading)లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు(Stock Markets) లాభాల్లో ముగిశాయి. అయితే సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు గంటపాటు జరిగిన ఈ ట్రేడింగ్ లో సెన్సెక్స్‌(Sensex) 335 పాయింట్ల లాభంతో 79,724.12 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 94.20 పాయింట్ల లాభంతో 24,299 వద్ద ముగిసింది. ఈ రోజు ముఖ్యంగా ఆటో మొబైల్ కంపెనీల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. దీంతో రెండు రోజుల నుంచి కొనసాగుతున్న వరుస నష్టాలకు బ్రేక్ పడింది.

లాభాలో ముగిసిన షేర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్

నష్టపోయిన షేర్లు : ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్

మూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి..?

ప్రతి సంవత్సరం దీపావళి పండగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లలో మూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది చాలా మంది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు(Stock Exchanges) ప్రతి సంవత్సరం దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు మాత్రమే కొనసాగుతుంది. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. కాగా మూరత్‌ ట్రేడింగ్‌ తొలిసారి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో(BSE) 1957లో స్టార్ట్ చేశారు. తర్వాత 1992లో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(NSE) స్థాపించినప్పుడు అదే సంవత్సరం నుంచి ఈ మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed