- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mallu Ravi: ఆయన పేరు ఎత్తగానే బీజేపీ భయపడుతోంది
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్(Parliament)లో అదానీ వ్యవహారంపై చర్చకు బీజేపీ(BJP) భయపడుతోందని కాంగ్రెస్(Congress) ఎంపీ మల్లు రవి(Mallu Ravi) విమర్శించారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అదానీ ముడుపుల కారణంగా అనేక మంది సామాన్యులకు నష్టం జరుగుతోందని అన్నారు. తాము సభను అడ్డుకోకపోయినా తమనే నిందిస్తున్నారని తెలిపారు.
అదానీ(Adani) పేరు ఎత్తగానే సభను వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. అదానీ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది. శీతాకాల సమావేశాల తొలిరోజే ఉభయ సభల్లో అదానీ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పట్టుబట్టారు. సమావేశాలను ప్రారంభించిన గంటలోనే ఎంపీల నినాదాలతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే రాజ్యసభలో అదానీ ఇష్యూపై చర్చ మొదలుపెట్టాలని కోరారు. అందుకు రాజ్యసభ చైర్మన్ అంగీకరించకపోవడంతో సభలో సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను ఎల్లుండి(నవంబర్ 27)కు వాయిదా వేశారు.