అల్లు అర్జున్, రానా లాంటి సూపర్ స్టార్లు మాకు గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-12-26 16:25:22.0  )
అల్లు అర్జున్, రానా లాంటి సూపర్ స్టార్లు మాకు గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ (Film industry) సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో చర్చించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(Command Control Center) వేధిక అయింది. ఈ సమావేశానికి ప్రోడ్యూసర్లు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, భోగవల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హీరోల నుంచి వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం వరుణ్ తేజ్ శివ బాలాజీ హాజరయ్యారు.అలాగే దర్శకుల సంఘం నుంచి వీర శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి సాయి రాజేష్, వశిష్ట , బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పాల్గోన్నారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్, మా అసోసియేషన్ నుంచి , తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం సినీ ప్రముఖులు తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టికెట్ ధరల(ticket prices) పెంపు, బెన్‌ఫిట్ షో(Benefit show)లు మినహా అన్ని సమస్యలపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎప్పుడు తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే పుష్ప-2 హీరో అల్లు అర్జున్(Allu Arjun), దగ్గుబాటి రానా(Rana) లాంటి సూపర్ స్టార్లు మాకు గర్వకారణం అని.. వాళ్లంతా మా ముందు పెరిగిన వారేనని.. వారిపై మాకు ఎలాంటి కోపం, ద్వేషం లేదని సినీ ప్రముఖుల సమావేశంలో సీఎం రేవంత్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది.

Read More...

Sub Committee: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన


Advertisement

Next Story