Devendra Fadnavi : బీజేపీకి అజిత్ పవార్ వర్గం మద్దతు.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్..?

by Shamantha N |
Devendra Fadnavi : బీజేపీకి అజిత్ పవార్ వర్గం మద్దతు.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్..?
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి నేతలు రెడీ అయ్యారు. అయితే, సీఎం ఎవరనే ప్రశ్న మాత్రం ఆ కూటమి నేతలను తిరకాసులో పెడుతోంది. ముఖ్యమంత్రి (Chief Minister) పదవికోసం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavi )‌, ఏక్‌నాథ్‌ షిండే ఇద్దరూ పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు సీఎం అవుతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా.. మహా తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మద్దతు తెలిపినట్లు సమాచారం. ఆదివారం జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్‌ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం.

మహాయుతి కూటమికి..

ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 సీట్లు సాధించింది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. ఏక్ నాథ్ షిండే వర్గం దగ్గర 57, అజిత్ పవార్ వర్గం దగ్గర 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్‌ ఫిగర్‌ కాగా, బీజేపీ దానికి ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ కి అజిత్ పవార్ వర్గం మద్దతు ఇవ్వడంతో.. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎంగా షిండేనే కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది.

Advertisement

Next Story

Most Viewed