- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ranbir Kapoor: ‘యానిమల్’ సినిమాపై విమర్శలు.. రణ్‌బీర్ కపూర్ ఏమన్నారంటే?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న కాంబోలో వచ్చిన మూవీ ‘యానిమల్’(Animal). సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది థియేటర్స్‌లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. అయినప్పటికీ ఈ మూవీలోని సీన్స్‌పై పలువురు విమర్శలు కూడా చేశారు.
తాజాగా, దీనిపై రణ్‌బీర్ కపూర్ స్పందించారు. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(International Film Festival of India) ఈవెంట్‌లో పాల్గొన్న రణ్‌బీర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘యానిమల్ విషయంలో అందరి అభిప్రాయాలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావడం మా బాధ్యత. అలాగే కొత్తదనాన్ని ప్రోత్సహించాలి. నటీనటులకు ఇది చాలా ముఖ్యం.
నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కెరీర్ బాగుంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నేటి తరానికి బాలీవుడ్ దిగ్గజాలను తెలిసేలా చేయాలి. అందుకే డిసెంబర్ 14 నుంచి 15 వరకు ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. అయితే నేను మొదటిసారి అలియా భట్(Alia Bhatt)ను కలిసినప్పుడు బాలీవుడ్ స్టార్ నటుడు కిశోర్‌కుమార్(Kishore Kumar) ఎవరో తెలియదు అని చెప్పింది. అప్పుడే అనిపించింది. గొప్ప వాళ్లను నేటితరం మర్చిపోకుండా ఉండాలంటే ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాలి’’ అని చెప్పుకొచ్చారు.