- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aghori Nagasadu: అఘోరీపై కేసు నమోదు.. కోడిని బలి ఇచ్చిందని ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను సందర్శిస్తున్న అఘోరీ నాగసాదు(Aghori Nagasadu)పై మామునూరు పోలీస్ స్టేషన్(Mamunur Police Station) లో కేసు(Case) నమోదు అయ్యింది. అఘోరీ ఇటీవల వరంగల్(Warangal), రంగశాయిపేట(Rangasaipet) బెస్తం చెరువు(Bestam Cheruvu) సమీపంలోని శ్మశాన వాటిక(crematorium)లో హల్ చల్ చేసింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే దీనిపై కరీంనగర్ జిల్లాకు చెందిన కసిరెడ్డి రోహన్ రెడ్డి(Kasireddy Rohan Reddy) అనే వ్యక్తి మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించినందుకు తెలంగాణ జంతువులు మరియు పక్షుల బలి నిషేధ చట్టం(Telangana Animals And Birds Sacrifice Act) కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు మామునూరు పోలీసులు అఘోరీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా అఘోరీ ఈ నెల 19న బెస్తం చెరువు సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో శరీరానికి బూడిద పూసుకొని, కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించింది. అంతేగాక శ్మశాన వాటికలో పడుకొని వింతగా ప్రవర్తించింది.