‘భారతీయ యువతకు మేధో సంపత్తి’.. మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘భారతీయ యువతకు మేధో సంపత్తి’.. మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జేఎన్టీయూ ప్రాంగణంలో భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పీఎం ఇంటర్న్​షిప్ ​అవేర్​నెస్ ​ప్రోగ్రామ్స్ ​ఫర్ ​స్టూడెంట్స్’​ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే వివిధ స్కాలర్​షిప్​లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్​ జనరేషన్ ​ప్రోగ్రామ్​(పీఎంఈజీపీ), స్టాండప్​ ఇండియా, స్టార్టప్​ ఇండియా వంటి ప్రోగ్రామ్​ల ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవచ్చు అని అన్నారు. అలాగే స్కిల్​ డెవలప్మెంట్​ కోసం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ ​యోజన, డీడీయూజీకే, స్కిల్​సెన్సెస్​ వంటివి ఉపయోగపడతాయి అని తెలిపారు. పీఎం ఇంటర్న్​షిప్ ​ఏడాది పాటు తీసుకుంటే చదువు అనంతరం కంపెనీల్లో చేరేందుకు వెయిటేజీ గా పరిగణిస్తారు. భారతీయ యువత మేధో సంపత్తి, తెలివితేటలు కలిగినవాళ్లు. ఇన్నోవేషన్​వైపు దృష్టి సారించి, ప్రభుత్వం అందిస్తున్న ప్రోగ్రామ్స్​ను ఉపయోగించుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం తో పాటు రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story