- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SP : బాధిత కస్టమర్ల బంగారం పదిలం..
దిశ, ప్రతినిధి వికారాబాద్: మోసపూరితంగా 3 కేజీల బంగారంతో పరారైన మణప్పురం గోల్డ్ లోన్ ఆలంపల్లి బ్రాంచ్ మేనేజర్ ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి(SP K. Narayana Reddy) తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వికారాబాద్ పట్టణంలోని మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ఆలంపల్లి బ్రాంచ్ లో భారీ దొంగతనం జరిగి సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిని కర్ణాటక రాష్ట్రంలోని ఔరద్ తాలూకా, నారాయణపూర్ గ్రామంలో అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. గత నెల అక్టోబర్ 19న మణప్పురం రీజినల్ మేనేజర్ రవీంద్ర కుమార్ వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ నందు ఆడిటర్ తన టీం సభ్యులతో కలిసి అక్టోబర్ 16న అడిట్ చేయగా ఒక బంగారం ప్యాకెట్ తక్కువ వస్తుందని గ్రహించారు.
రీజినల్ మేనేజర్ బ్రాంచ్ కి రాగ బ్రాంచ్ మేనేజర్ విశాల్ అక్కడ లేకపోవటంతో అతనికి ఫోన్ చేయగా ఫోన్ లేపకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఆడిటర్, ఇతర సభ్యులతో కలిసి అడిట్ నిర్వహించగా మొత్తం 63 బంగారం నగల ప్యాకెట్ లు కనిపించడం లేదు. వీటి మొత్తం బరువు సుమారు 2944.226 గ్రాములు, వాటి విలువ రూ.2,10,80,290 ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్ విశాల్ తన కంపెనీకి నమ్మక ద్రోహం చేసి, మోసపూరితంగా బంగారు నగలు దొంగతనం చేసాడని, అతనికి జూనియర్ అసిస్టెంట్ లు శివప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఆడిటర్ రాజకుమార్ లు సహకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించి నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం ఏ1 నిందితుడు అయినా విశాల్ ను తన స్వగ్రామం నారాయణపూర్ గ్రామంలో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
నేరం చేసింది ఇలా...
మణప్పురం గోల్డ్ లోన్ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడైన విశాల్ జూలై 2023 నుండి వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ ఆలంపల్లి బ్రాంచ్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ఈ కంపెనీలో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే సదురు వ్యక్తి ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, తాకట్టు పెట్టే బంగారం తీసుకొని రావలసి ఉంటుంది. ఆన్లైన్ లో కస్టమర్ వివరాలు నమోదు చేసి కస్టమర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత బంగారం యొక్క నాణ్యతను పరిశీలించి ఒక గ్రాము ప్లెడ్జ్ విలువ రూ.5,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఒక కస్టమర్ ఐడి నమోదు అయిన తర్వాత ఆ కస్టమర్ మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే బంగారం మాత్రమే తెస్తే సరిపోతుంది. ఇలా ఎన్నిసార్లు అయిన బంగారాన్ని పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే తమ బిజినెస్ కొరకు ప్రతిరోజు ఒక్క లోన్ అయిన తప్పకుండా చేయాలని కంపెనీ నిబంధన. దానిని ఆసరాగా తీసుకున్న మేనేజర్ విశాల్ తన అవసరాల కోసం మేనేజ్మెంట్ యొక్క డబ్బును నకిలీ లోన్లు క్రియేట్ చేసి నగదు రూపంలో తీసుకోవాలని ప్లాన్ వేశాడు.
తన కింది స్థాయి సిబ్బందిని తను నిజాయితీ పరుడిగా నమ్మించి మొత్తం 20 మంది కస్టమర్ల పైన 63 నకిలీ ఇన్వెంటరీ ఐడిలు నమోదు చేసి మొత్తం రూ.1 కోటి 24 లక్షలు బ్రాంచ్ నుండి కాజేయడం జరిగింది. పై అధికారులు ఆడిట్ కు వచ్చే సమయంలో నిందితుడు ఏ ఏ ఐడి లలో ఆడిట్ జరుగుతుందో అట్టి ఐడిల సమాచారం ముందుగానే తెలుసుకుని మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఈ విధంగా డబ్బులు తీసుకొని కోట్లు సంపాదించాలని దురాశతో బెట్టింగ్ లో పెట్టడం జరిగింది. ఇందులో కొంత డబ్బు తన సొంతానికి కూడా వాడుకోవడం జరిగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం ప్యాకెట్ల నుండి 5 ప్యాకెట్లు దొంగతనం చేసి పారిపోగా నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం నిందితున్ని వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి 5 బంగారం ప్యాకెట్లలోని 83 గ్రాముల బంగారంతో పాటు రూ.10 లక్షల నగదును రికవరీ చేయడం జరిగింది.
నిందితులపై 303 (2), 316 (5), 318 (4) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నేరస్థుడికి సహకరించిన వారిపైన, ఆడిట్ నిర్వహించిన వారిపైన, విజిలెన్స్ టీమ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపైనా దర్యాప్తు కొనసాగడం జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు. అలాగే మణప్పురం గోల్డ్ లోన్ లో గల కస్టమర్ల ఏ బంగారం దొంగలించబడలేదని, ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కేసును ఛేదించిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ఇన్స్పెక్టర్ బలవంతయ్య, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్, ధారూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘు రాములు, పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.