శంషాబాద్ విమానాశ్రయంలో పాములు కలకలం

by Kalyani |
శంషాబాద్ విమానాశ్రయంలో పాములు కలకలం
X

దిశ శంషాబాద్ : విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా పాములను సరఫరా చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల లగేజ్ బ్యాగులపై అనుమానం వచ్చి తనిఖీలు, స్కానింగ్ చేయడంతో ఆ బ్యాగులలో విషపూరితమైన పాములు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 3 విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed