- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే
దిశ, కేసముద్రం: సోమవారం కేసముద్రం మండలం పరిధిలోని తాళ్లపూసపల్లి గ్రామంలో అన్నదాతల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ మాట్లాడుతూ...రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. అన్నదాతలు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు, మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, రైతులను రాజు చేయడమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , కాంగ్రెస్ సీనియర్ నాయకులు దశ్రు నాయక్ , మండల పార్టీ నాయకులు, డైరెక్టర్లు, జిల్లా నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు, రైతులు,మాజీ ప్రజాప్రతినిధులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.