- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Tips : ఈ తెల్లటి పదార్థాలు తింటున్నారా..! తర్వాత జరిగేది ఇదే..
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ, కీడు చేయడంలోనూ ఆహారాలు కీలకపాత్ర పోషిస్తాయి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెరలు కలిగినవి ప్రతికూల ప్రభావం చూపితే, ఫైబర్ ఫుడ్స్, తాజా కూరగాయలు, పండ్లు వంటివి మేలు చేస్తాయి. అయితే మనం తరచుగా వాడే కొన్నిరకాల తెల్లని ఆహారాలు కూడా హెల్త్‌కు మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేటో చూద్దాం..
తెల్లటి చక్కెర, తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, తెల్ల ఉప్పు, తెల్ల వెన్న వంటివి అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. తెల్లటి చక్కెర అధికంగా తీసుకోవడం శరీరంలో మంట, కేలరీలు, లిపిడ్లు, షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఇక వైట్ బ్రెడ్‌లో ఫైబర్ ఉండదు కాబట్టి, జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. తెల్లటి బియ్యం అధికంగా పాలిష్ చేయడంవల్ల కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటూ వేరే ఆహారాలు తీసుకోకపోతే ఒబేసిటీ, గుండె జబ్బులకు దారితీయవచ్చు. అలాగే తెల్లటి ఉప్పు అధికంగా తీసుకోవడంవల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే చాన్స్ ఉంటుంది. ప్రత్యామ్నాయంగా సముద్రపు ఉప్పు లేదా పింక్ సాల్ట్ ఉపయోగించడం బెటర్ అంటుననారు పోషకాహార నిపుణులు. ఇక వైట్ బటర్ వంటి ప్రాసెస్ చేయబడిన కొవ్వులు గుండె ఆరోగ్యానికి హానికరం కాబట్టి బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వంటివి వాడాలని సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
👉Also Read: ప్రెగ్నెన్సీలో డిప్రెషన్..! పుట్టుబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందా?