- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kiran Abbavaram: బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘క’ మూవీ.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’(Ka). సుజిత్, సందీప్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో నయన్ సారిక(Nayan Sarika), తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అయితే కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘క’(Ka).. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అంతేకాకుండా కలెక్షన్లు కూడా బాగానే రాబడుతూ బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది. అయితే ‘క’ చిత్రం మొదటి రోజే రూ. 6.18 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, కిరణ్ అబ్బవరం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘క’(Ka) హిట్ అవడంపై రియాక్ట్ అయ్యాడు. ‘‘ఏ సినిమా అయినా విజయం సాధిస్తే హిట్ కొట్టాడు అంటారు. కానీ ‘క’(Ka) తో హిట్ కొట్టేసాము అంటున్నారు. సినిమాకంటే గొప్పది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. క దీపావళి బ్లాక్ బస్టర్’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ కిరణ్ అబ్బవరం పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.