Bitter Gourd : రుచిలో చేదు.. ఆరోగ్యానికి మేలు.. ఈ కూరగాయ గురించి తెలిస్తే అస్సలు వదలరు!

by Javid Pasha |
Bitter Gourd : రుచిలో చేదు.. ఆరోగ్యానికి మేలు.. ఈ కూరగాయ గురించి తెలిస్తే అస్సలు వదలరు!
X

దిశ, ఫీచర్స్ : కాకరకాయ.. రుచిలో చేదుగా ఉంటుంది కానీ ఈ కూరగాయలో అద్భుత పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగు పరచడం ద్వారా ఇది ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.

*కాకర కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎ, సి, కె విటమిన్లు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, డైటరీ ఫైబర్‌లకు ఇది మంచి మూలం. కాబట్టి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. శరీరంలో నొప్పిని, వాపును తగ్గిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లకు కాకర కాయ మంచిది.

*కాకరకాయలో విటమిన్ సి కూడా ఉండటం మూలంగా ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మొటిమలు, స్కిన్ అలెర్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ మూలంగా కడుపులో ఉబ్బరం, మలబద్ధకం, అధిక బరువు సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి కాకర కాయను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed