- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన.. ప్రారంభం కాని తూకం
దిశ, కొల్చారం: మెదక్ జిల్లాలో మంజీరా, హల్దీ పరివాహక ప్రాంతాలలో భూగర్భ జలాల ఆధారంగా వర్షాకాలం లో వరి పంటను రోహిణి కార్తిలోనే నారుమడులు వేసి వర్షాకాలం సీజన్ ప్రారంభం లో వరి నాట్లు వేస్తారు. దీంతో దసరా కంటే ముందే వరి కోతలు ప్రారంభమవుతాయి. దీపావళి వరకు ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతోంది. దొడ్డు రకం ధాన్యం దీపావళి వరకు 80% కాంటాలు పూర్తవుతాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో సన్న రకం దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం ఐకెపి ,సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో 497 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు 400 వరకు కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
ప్రస్తుత వానకాలం సీజన్ లో సన్న రకం 1.05 లక్షల ఎకరాలలో, దొడ్డు రకం 1.95 లక్షల ఎకరాలలో పంటలు సాగు ఈ వర్షాకాలం సీజన్ లో సన్న రకం దొడ్డు రకం పంటలు ఆశాజనకంగా ఉండడంతో సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉంది అని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లు జిల్లాలో వివిధ ఏజెన్సీల ద్వారా సన్న రకం దొడ్డు రకం ధాన్యానికి కలిపి 497 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే సుమారు 400 పై చిలుక కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అయినప్పటి కి ధాన్యం తూకం ప్రారంభించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కోతలు కోసి ఆరబెట్టి ధాన్యం రాశులు కుప్పలుగా మార్చి రైతులు తూకం కోసం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది.
కొల్చారం మండలంలోని రంగంపేట, వరిగుంతం, చిన్నగనాపూర్, వెంకటాపూర్, కొంగోడు తదితర గ్రామాలలో 20 రోజుల క్రితమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సహకార సంఘాల, ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జిల్లా అధికారులు ప్రారంభించారు. అయినా ఇప్పటికీ ఒక బస్తా ధాన్యం కూడా తూకం వేయలేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తుంది. ధాన్యం రైతులు ఆరబెట్టి కుప్పలుగా మార్చి సుమారు 20 రోజులు కావొస్తుంది.
అయినప్పటికీ ధాన్యం కాంటాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దళారులు రైతులను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక బస్తా తూకానికి మూడు కిలోల తరుగు పేరా దోచుకోవడంతోపాటు ధరలో కూడా క్వింటాలుకు 300 నుంచి 400 వరకు మద్దతు ధరకు తక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తూకంలో ధర లో రెండు విధాల నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్ లను అలాట్ చేసి కొనుగోలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని రైతుల కోరుతున్నారు.
*నెల రోజులు కావస్తోంది: లింగాపురం చిన్న మల్లయ్య, రంగంపేట.
దొడ్డు రకం ధాన్యం ఐదు ఎకరాలలో సాగు చేశాను. దసరా కంటే ముందే కోత పనులు పూర్తయ్యాయి. సుమారు నెల రోజులుగా ధాన్యం తూకం కోసం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్న ఇప్పటికి తూకం ప్రారంభం కాలేదు. కాంటా ఎప్పుడు పెడతారని అధికారులను అడిగిన ఎవరూ సమాధానం చెప్పడం లేదు. వెంటనే తూకం ప్రారంభమయ్యేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి.
*టాపర్ల అద్దె తడిసి మోపెడు అవుతుంది: మోకిరే సత్యనారాయణ , రైతు, సంగాయిపేట.
వరి ధాన్యం కోత కోసి ఆరబెట్టి తూకం కోసం కుప్పగా పోసి సుమారు 25 రోజులు అవుతుంది. కాంటాలు ప్రారంభం కాకపోవడంతో ధాన్యం రాశులపై కప్పిన టాపర్లు అద్దె భారం అవుతుంది. ప్రతి ఏటా ఇప్పటివరకు కాంటాలు ప్రారంభం అయ్యేవి. కానీ ఈసారి కాంటా ప్రారంభం కాకపోవడంతో దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. వెంటనే ధాన్యం తూకం ప్రారంభించి ధాన్యం మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
*దళారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది: ఎరుకల భాగయ్య , రైతు,చిన్న ఘనపూర్.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారు. కానీ ధాన్యం తూకం వెయ్యకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు క్వింటాలుకు మద్దతు ధర కంటే మూడు నాలుగు వందలు తక్కువ కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు వెంటనే ధాన్యం తూకం వేసి రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.