CPM : పేదల నివాసాలు కూల్చి రోడ్లు వేయొద్దు

by Sridhar Babu |
CPM : పేదల నివాసాలు కూల్చి రోడ్లు వేయొద్దు
X

దిశ బ్యూరో, ఖమ్మం : పేద ప్రజల నివాసాలను కూల్చి రోడ్లు వేయొద్దని సీపీఎం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు (Erra Srinivasa Rao)అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28వ డివిజన్ ప్రకాష్ నగర్ లో గాయత్రి కోల్డ్ స్టోరేజ్ ముందు రైతులు పంట పొలాల కోసం కాలువను తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఆ కాల్వను పూడ్చి దానిమీద 60 అడుగుల రోడ్డు వేయాలని స్థానిక కార్పొరేటర్ ప్రపోజల్ పెట్టారని ఆరోపించారు. 40 సంవత్సరాల నుంచి ప్రజలు స్థలాలు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి పన్నులు కడితే రోడ్డు పేరుతో కూల్చి వేస్తామని అధికారులు సిద్ధమవుతున్నారని తెలిపారు.

ప్రజలకు సౌకర్యంగా ఉన్న ప్రాంతాలలో వేయాల్సిన రోడ్లను అవసరం లేని చోట వెడల్పు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించకపోతే ప్రజలను కలుపుకొని ఉద్యమాలు (Make movements)చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, సీపీఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ హిమామ్, రంగు హనుమంతాచారి, యమ్మని వెంకటేశ్వర్లు, నాయిని నరసింహారావు, మహిళా సంఘం జిల్లా నాయకురాలు గుడిమెట్ల రజిత, లక్ష్మణ్, రేణుక, లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Next Story