- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని ట్యాక్సులు రద్దు చేశాం.. ఎవరైనా అడ్డొస్తే ఫోన్ చేయండి: Cm Chandrababu
దిశ, వెబ్ డెస్క్: ఉచిత ఇసుక(Free sand) విధానంలో నేతల జోక్యంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) హాట్ కామెంట్స్ చేశారు. ఇసుకపై అన్ని ట్యాక్సులు రద్దు చేశామని, ఎవరైనా అడ్డొస్తే ఫోన్ చేయండని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఇకపై కల్తీ మద్యం(Adulterated liquor) ఉండదని, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇసుక పాలసీపై ఎవరైనా జోక్యం చేసుకుంటూ పీడీ యాక్ట్ పెడతామన్నారు. పోలవరం(Polavaram) డయాఫ్రం వాల్‌ను గత ప్రభుత్వం పాడు చేసిందని, ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. విశాఖపట్నం(Visakhapatnam)ను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని, అమరావతి(Amaravati)ని బాగు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant)ను కాపాడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు. ఇ ప్పటికే మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించామని, డిసెంబర్‌లోగా 16 వేల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ టైటిల్ యాక్ట్(Land Title Act)తో పాటు చెత్త పన్ను విధానాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్(Former CM Jagan) పోతూ పోతూ 85 లక్షల టన్ను చెత్త ఎత్తకుండా ఉంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్(Visakha Railway Zone)కు లైన్ క్లియర్ అయిందని, గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని తెలిపారు. భావనపాడులో 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్(Industrial Park) ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.