Minister Sitakka : డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి : మంత్రి సీతక్క

by Y. Venkata Narasimha Reddy |
Minister Sitakka : డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : డైట్, కాస్మోటిక్ చార్జీ(Diet and cosmetic charges)లు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీసుకున్న నిర్ణయంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని ఇదే విద్యార్థులకు అసలైన దీపావళి అని పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Sitakka) తెలిపారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్ రెడ్డి సీఎంగా వున్నారని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. అందుకే ఎన్నడు లేని విధంగా పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ 40% పెంచడం జరిగిందని ఇందుకు సీఎంకు ధన్యవాదాలన్నారు. ఇక హాస్టల్ విద్యార్థులు అర్థాకళితో అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు.

డైట్ చార్జీలు ఏడేండ్లుగా , కాస్మోటిక్ గత 16 సంవత్సరాలుగా పెరగలేదని, ఏడు సంవత్సరాల క్రితం డైట్ చార్జీలు కొంచెం పెంచి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, ఏడేళ్లుగా విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదన్నారు. దీంతో పిల్లలు అర్ధాకలితో ఇబ్బందులు పడ్డారని, విద్యా శాఖకు బీఆర్ఎస్ చేసింది శూన్యమని, వారి హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందన్నారు. పదేళ్ళు అధికారంలో ఉండి టాయిలెట్స్ కట్టలేదని..తాగు నీరు, మౌలిక వసతులు కల్పి్ంచలేదని విమర్శి్ంచారు. హస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని తెలిపారు. పెంచిన చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లది హాస్టల్ సిబ్బందిదేనని స్పష్టం చేశారు.

Advertisement

Next Story