పలమనేరు DSP కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి

by Mahesh |
పలమనేరు DSP కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy) శుక్రవారం మధ్యాహ్నం పలమనేరు డీఎస్పీ(DSP) కార్యాలయానికి వచ్చారు. గతంలో పుంగనూరు అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు గా ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే సమాచారంతో ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్నారు. ప్రజాప్రతినిధి కావడంతో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో కోర్టు(Court) ఉత్తర్వుల మేరకు ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy).. పలమనేరు DSP కార్యాలయానికి చేరుకొని బెయిల్ కోసం కావాల్సిన ష్యూరిటీలు సమర్పించారు. అనంతరం ష్యూరిటీలను పరిశీలించిన డీఎస్పీ ఎంపీ కి స్టేషన్ బెయిల్(Station Bail) మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed