- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Indian Rupee: ట్రంప్ ఎఫెక్ట్.. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ

దిశ, డైనమిక్ బ్యూరో: రూపాయి (Indian rupee) విలువ భారీగా క్షీణిస్తోంది. డాలర్ (Dollar) తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఆందోళన కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజు రోజుకూ పతనం అవుతూ వస్తున్న రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో కనిష్టానికి పరుగులు తీస్తోంది. తాజాగా ఫిబ్రవరి 3న ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. చరిత్రలో తొలిసారిగా డాలర్ తో పోలిస్తే రూ. 87 దాటి పడిపోయింది. కెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థలో విస్తృత వాణిజ్య యుద్ధ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 67 పైసలు క్షీణించి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 87.29 వద్ద రికార్డు స్థాయిలో క్షీణతకు గురైంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ 86.62 వద్ద స్థిరపడింది.
ఇక వాణిజ్య యుద్ధమే!
డొనాల్డ్ ట్రంప్ కెనడా(Canada), మెక్సికో(Mexico) పై 25 శాతం, చైనా (China) పై 10 శాతం సుంకం విధించారు. ఈ చర్య విధ్వంసక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే మొదటి సమ్మె అని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి సహా క్రూడాయిల్ ధరలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రకటనలు ఇలా ఇందంతా రూపాయి విలువపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో రూపాయి పతనం కొనసాగుతాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తుండగా దేశీయంగా ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి.